News March 18, 2025
బయ్యారం: పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య

కాకతీయ నగర్ కాలనీలో సోమవారం అజ్మీర(సాయి) మహేశ్(18) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మృతుడు సిద్దిపేట జిల్లాలోని ఓ కళాశాలలో ఫిజియో థెరఫీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News April 23, 2025
వీరబల్లి: ప్రభుత్వ స్కూల్ అమ్మాయికి 595 మార్కులు

ఏపీలో బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్ల అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం రెడ్డివారిపల్లె గ్రామం, పెద్దవీడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని రాసినాటి మేఘ 595/600 మార్కులు సాధించినట్లు డీఈవో శివకుమార్, హెచ్ఎం మధుసూదన రాజు తెలిపారు. మండల, జిల్లా స్థాయిలో కాకుండా, రాష్ట్రస్థాయిలో కూడా విజయ దుందుభి మోగించిట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.
News April 23, 2025
‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’

బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాకు సంబంధించి ‘All Eyes On Rafah’ అని SMలో ఊదరగొట్టిన బీటౌన్ బడా నటులంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. J&K పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే వారికి పట్టడం లేదంటూ విమర్శిస్తున్నారు. ‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే’ అని నిలదీస్తున్నారు.
News April 23, 2025
నాగర్‌కర్నూల్: 60 రోజులు.. కొనసాగుతున్న అన్వేషణ..!

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి SLBC సొరంగంలో ప్రమాద ఘటనకు 60 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఆరుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. డీ-1 నుంచి డీ-2 ప్రదేశం వరకు దాదాపు శిథిలాలు తొలగించారు. డేంజర్ జోన్ అయిన మిగిలిన 43 మీటర్ల పరిధిలో ఆ ఆరుగురి మృతదేహాలు ఉండొచ్చని సిబ్బంది అభిప్రాయానికి వచ్చారు. 12 రకాల విభాగాల అధికారులు నిత్యం రెస్క్యూ చేస్తున్నారు.