News February 18, 2025
బర్డ్ఫ్లూ బఫర్ జోన్లో నిరంతర అప్రమత్తత: కలెక్టర్

గంపలగూడెం మండలంలోని కోళ్ల మరణాలకు సంబంధించి బర్డ్ఫ్లూ నిర్ధారణ కావడంతో 10 కిలోమీటర్ల పరిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను కొనసాగించాలని కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అనుమల్లంక ఘటన నేపథ్యంలో నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
Similar News
News November 9, 2025
HNK: జాబ్ మేళాలో 214 మందికి ఉద్యోగాలు

హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళ నిర్వహించారు. ఇందులో 214 మందికి ఉద్యోగాలు పొందారని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు. జాబ్ మేళాకు 1200 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా 600 పైచిలుకు హాజరయ్యారన్నారు. 24 సంస్థలు వివిధ రంగాల్లో 214 మంది విద్యార్థులకు అపాయింటుమెంట్ పత్రాలు అందజేశారని తెలిపారు.
News November 9, 2025
పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించండి: టీఐయూఎఫ్

ఉపాధ్యాయుల పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఐయూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వరంగల్లోని కృష్ణ కాలనీ పాఠశాలలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ టీచర్స్ బెనిఫిట్స్ చెల్లించాలని, సర్దుబాటును పారదర్శకంగా నిర్వహించాలని, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు.
News November 9, 2025
రేపు ఎనుమాముల మార్కెట్ OPEN

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రేపు తిరిగి ప్రారంభం కానుండగా రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.


