News February 13, 2025
బర్డ్ ప్లూతో కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్

ఉంగుటూరు(M) బాదంపూడిలో పౌల్ట్రీలో బర్డ్ ప్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించిందని, 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కార్యాచరణ పై కలెక్టర్ పలు శాఖల వారితో సమీక్షించారు. పశుసంవర్ధక శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నంబర్ 9966779943 ఏర్పాటు చేశామన్నారు. బర్డ్స్ ఎక్కడ చనిపోయినా సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News September 14, 2025
ఏలూరు: సెప్టెంబర్ 16న కలెక్టరేట్లో జాబ్ మేళా

ఏలూరు జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి సెప్టెంబర్ 16న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కాంపౌండ్లో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు శనివారం తెలిపారు. NCS నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లమో ఉత్తీర్ణత పొందిన 18-26 సంవత్సరాల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.
News September 14, 2025
రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలు

AP: కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు పాతాళం వైపు పయనిస్తున్నాయి. రైతుల వద్ద క్వింటాను మార్క్ఫెడ్ రూ.1,200కు కొనుగోలు చేయగా నిల్వలు పెరిగిపోయాయి. కొత్త సరకు వస్తే దించుకోవడానికి స్థలం లేకపోవడంతో తమ వద్ద ఉన్న స్టాకును కొనాలని వ్యాపారులను మార్క్ఫెడ్ కోరింది. తొలుత ఆసక్తి చూపని వ్యాపారులు ఆపై నాణ్యతను బట్టి క్వింటా రూ.50 నుంచి రూ.450 వరకు కొన్నారు. 800 టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయి.
News September 14, 2025
శ్రీకాకుళం: కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.