News April 4, 2025
బర్డ్ ఫ్లూ కాదు… బాలిక మృతికి ఇతర కారణాలే

నరసరావుపేటలో బాలిక మృతిపై బర్డ్ ఫ్లూ అనుమానాలు తొలగిపోయాయి. ICMR బృందం తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాధినిరోధక శక్తి లోపం, అపరిశుభ్రత, లెప్టోస్పిరోసిస్ వంటి కారణాలే ప్రాణాపాయానికి దారితీశాయని తేలింది. బాలిక నుంచి H5N1 లక్షణాలు కనుగొన్నా, పరిసరాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యాధికారులు అన్నారు.
Similar News
News November 20, 2025
ANU: ‘మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.
News November 20, 2025
ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం: మంత్రి నాదెండ్ల

జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.
News November 19, 2025
గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

వెలగపూడి సచివాలయంలోని గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పరిశీలించారు. వీవీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణలో కేంద్రం కీలకమని పేర్కొంటూ పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని, డ్రోన్ గస్తీని కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు-కరకట్ట మార్గాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.


