News February 12, 2025
బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించాలి: కలెక్టర్

అంగన్వాడీ పిల్లల్లో బలహీనంగా ఉన్నవారిని గుర్తించి, వారి గ్రోత్ మోనిటరింగ్ ను పర్యవేక్షించాలని, ప్రతి నెలా ప్రగతి కనబడాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్వ ప్రాధమిక విద్యకు పునాదిగా భావించి, పిల్లలను వీలైనంతవరకు కేంద్రానికి వచ్చేలా చూడాలని, వారికి ఆట పాటలతో విద్యను అందించాలని సూచించారు. టేక్ హోమ్ రేషన్ ఇచ్చేశామంటే సరిపోదని తెలిపారు.
Similar News
News March 23, 2025
విశాఖలో IPL మ్యాచ్‌కు స్పెషల్ బస్సులు

విశాఖలో సోమవారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఏపీఎస్ఆర్టీసీ 30 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియానికి నడపనున్నారు. ఈ స్పెషల్ బస్సులు గాజువాక, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, సింహాచలం, కూర్మన్నపాలెం నుంచి మధురవాడకు నడపనున్నట్లు వెల్లడించారు. రద్దీ అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు. ప్రయాణీకులు గమనించాలని కోరారు.
News March 23, 2025
27న పోలవరానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
News March 23, 2025
కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.