News November 2, 2024

బలిజిపేట: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటే క్రమంలో వ్యక్తి మృతి చెందాడు. రాయపూర్ పాసింజర్ రైలు ఢీకొని బలిజిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఇప్పలి అప్పలరాజు (64) మృతి చెందారు. కూనేరు సంతకు వెళ్లేందుకు రైలు ఎక్కేందుకు వస్తుండగా రైలు ఢీకొని ఉంటుందని బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 18, 2025

సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకూడదు: VZM కలెక్టర్

image

శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పండగ ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. VIP దర్శనాలు వలన సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకూడదన్నారు.

News September 18, 2025

పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

image

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 17, 2025

ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

image

ఈ నెల 19వ తేదీ శుక్ర‌వారం ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.రామ‌సుంద‌ర్ రెడ్డి బుధవారం తెలిపారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఈ కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని వెల్లడించారు. ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌ల‌పై ఈ గ్రీవెన్స్‌లో ధ‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయ‌వ‌చ్చున‌ని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.