News January 22, 2025
బల్మూర్: చెన్నారం కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్

బల్మూరు మండలం చెన్నారం గ్రామపంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌ను జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ బుధవారం సస్పెండ్ చేశారు. ప్రజాపాలన గ్రామసభలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన విధులకు హాజరు కాలేదు. ఈ అంశంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా గ్రామసభలలో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 18, 2025
స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా డా. కె.అరుణప్రియ

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా డా కె.అరుణప్రియను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. డా.కె అరుణప్రియ ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. ఈ సందర్భంగా అరుణప్రియను అధికారులు, విద్యార్థులు అభినందించారు.
News November 18, 2025
HNK: లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్

హనుమకొండ టీవీ టవర్ కాలనీకి చెందిన నవీన్ అనే యువకుడు లోన్ యాప్ వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైనాకు చెందిన యాప్‌లో లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో, అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్, వేధింపులు తట్టుకోలేక వడ్డేపల్లి-దేవన్నపేట మధ్యలోని బావిలో దూకి బలవన్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
News November 18, 2025
X(ట్విటర్) డౌన్‌కు కారణమిదే!

ప్రముఖ SM ప్లాట్‌ఫామ్ ‘X’ సేవలు <<18322641>>నిలిచిపోయిన<<>> విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. దాని హోస్ట్ సర్వర్ ‘క్లౌడ్‌ఫ్లేర్’లో గ్లిచ్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. X మాత్రమే కాకుండా క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడిన కాన్వా, పర్ప్లెక్సిటీ వంటి సేవలు నిలిచిపోయాయి. ‘సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని క్లౌడ్‌ఫ్లేర్ సంస్థ వెల్లడించింది.


