News January 22, 2025

బల్మూర్: చెన్నారం కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

బల్మూరు మండలం చెన్నారం గ్రామపంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌ను జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ బుధవారం సస్పెండ్ చేశారు. ప్రజాపాలన గ్రామసభలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన విధులకు హాజరు కాలేదు. ఈ అంశంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా గ్రామసభలలో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News February 9, 2025

బంగ్లాదేశ్‌లో హిందువులపై 2 నెలల్లో 76 దాడులు

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 26, 2024 నుంచి జనవరి 25, 2025 వరకు బంగ్లాలో హిందువులపై మొత్తం 76 దాడులు జరిగాయని పార్లమెంటులో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 23 మంది హిందువులు చనిపోయారని, 152 దేవాలయాలపైనా దాడులు జరిగినట్లు పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

News February 9, 2025

ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఎల్లారెడ్డి పట్టణ శివారులోని మీసాన్ పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి బిక్కనూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఏగొండ(18) అనే యువకుడు తన వాహనాన్ని అతివేగంగా నడిపి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News February 9, 2025

ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

error: Content is protected !!