News April 13, 2025

బల్లికురవ: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

image

బల్లికురవ మండలం కొప్పెరపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి నరసరావుపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 15 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను స్థానికులు బయటకు తీశారు. గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News November 15, 2025

ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొంటాం: మంత్రి మండిపల్లి

image

APSRTCని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఇకపై డీజిల్ బస్సులను కొనబోమని, రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్త్రీ శక్తి పథకం బాగా నడుస్తోందని, దీనిపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు మౌనం వహించారని ఎద్దేవా చేశారు.

News November 15, 2025

39,506 మారుతీ గ్రాండ్ విటారా కార్లు వెనక్కి

image

సాంకేతిక సమస్యలు తలెత్తిన గ్రాండ్ విటారా మోడల్ కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2024 DEC 9 నుంచి 2025 APR 29 వరకు తయారైన 39,506 కార్లలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సిస్టమ్‌లో లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఆథరైజ్డ్ డీలర్ వర్క్‌షాప్స్‌లో ఆ కార్లను పరీక్షించి లోపాలున్న పరికరాలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది.

News November 15, 2025

ప.గో జడ్పీ కార్యాలయంలో 14 మందికి ప్రమోషన్స్

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న 14 మంది దిగువ శ్రేణి సిబ్బందికి పదోన్నతి కల్పిస్తూ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ శనివారం ఉత్తర్వులు అందజేశారు. జిల్లా పరిషత్ యాజమాన్యం తమ శ్రమను గుర్తించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమర్థవంతంగా పనిచేయాలని పద్మశ్రీ సూచించారు.