News December 2, 2024

బల్లికురవ: ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం

image

13 నెలల చిన్నారి ఖాన్సాకు తల్లిదండ్రులు ఎటువంటి కష్టం రాకుండా పెంచుకున్నారు. చిన్నపాటి అనారోగ్యంగా ఉండటంతో చిలకలూరిపేట ఆసుపత్రిలో చూపించుకున్నారు. తిరిగి వస్తుండగా గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తమ కళ్లెదుటే, చేతుల్లోనే చిన్నారి మృతి చెందడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన బల్లికురవ మండలంలోని వేమవరంలో ఆదివారం జరిగింది. వీరిది సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామం.

Similar News

News December 28, 2024

జపనీస్ భాషపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా జపనీస్ భాషపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న డిమాండుకు అనుగుణంగా కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.

News December 27, 2024

పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతి: కలెక్టర్

image

పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనుమతుల కోసం వచ్చిన 565 దరఖాస్తులలో 499 ఆమోదం పొందాయని చెప్పారు.

News December 27, 2024

బాపట్ల కలెక్టరేట్‌లో ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్

image

బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీల వద్ద ఆయన అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వేగంగా పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. జేసీ ప్రకార్ జైన్. ఇతర అధికారులు పాల్గొన్నారు.