News February 25, 2025
బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య

బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన తల్లి ఎల్లమ్మ (58), కొడుకు మొగులప్ప 36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 1, 2025
శ్రీకాకుళం జిల్లాలో 8,485 HIV కేసులు.!

జిల్లాలో సుమారు 8,485 HIV కేసులు ఉన్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి శ్రీకాంత్ తెలిపారు. అందులో 3,526 మంది పురుషులు, 4,606 మంది స్త్రీలు, 23 ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆసుపత్రి, రాగోలులో ART కేంద్రాలతో పాటు ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, కోటబొమ్మాళి,నరసన్నపేట, రణస్థలం,పాతపట్నం,పొందూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ICTC కేంద్రాల ద్వారా మందులు అందిస్తున్నామన్నారు.
News December 1, 2025
అధ్యక్షా.. RDTని రక్షించండి!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్డీటీకి FCRA రెన్యువల్ విషయంపై వారు గళమెత్తాలని ప్రజలు ఆశిస్తున్నారు. రాయదుర్గం, అనంత, హిందూపురంలో రైల్వే సమస్యలు.. అరటి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర, ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు, వేగవంతంపై ఎంపీలు గొంతు విప్పాల్సిన అవసరముంది.
News December 1, 2025
సంగారెడ్డి: నేడు ఎన్నికల విధులపై శిక్షణ

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు నేడు శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు శిక్షణకు హాజరు కావాలని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


