News November 20, 2024

బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం.. తమిళనాడు వాసి మృతి

image

బసినికొండ బైపాస్ రోడ్డులో ఈ నెల 17న అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డ తమిళనాడు వాసి, బుధవారం రుయాలో మృతి చెందాడు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ వివరాల ప్రకారం.. తమిళనాడు, డిండిగల్ జిల్లా పెరియకోటకు చెందిన మారముత్తు(45) స్థానిక సీటీఎం రోడ్డు, దేవతానగర్‌లో ఉన్న బంధువుల ఇంటికి బైకుపై వస్తుండగా బసినికొండలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈఘటనలో బాధితుడు మృతి చెందాడు.

Similar News

News December 4, 2024

చిత్తూరులో విషాదం.. 12 ఏళ్ల బాలిక మృతి

image

బంగారుపాలెంలోని ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. శేషాపురానికి చెందిన గుణశ్రీ జ్వరంతో బాధపడుతుండగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంజక్షన్ వేశారు. కొంతసేపటికే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 4, 2024

తిరుపతిలో 5న జాబ్ మేళా

image

పద్మావతి పురం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News December 2, 2024

చిత్తూరు: 120 స్మార్ట్ అలారం లాక్ పంపిణీ

image

టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నెట్టికంటయ్య నగరంలోని పలు ప్రార్ధనా మందిరాలకు 120 స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నియంత్రణకు టూ టౌన్ పరిధిలోని అన్ని చర్చిలు, దేవాలయాలు, మసీదులకు స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేస్తున్నామన్నారు. దుకాణా దారులు, ఇంటి యజమానులు సైతం ఈ లాక్ లను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.