News January 9, 2025
బసినేపల్లిలో రూ.1.50 లక్షల విలువైన వజ్రం లభ్యం
పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలోని బసినేపల్లిలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం లభ్యమైంది. గ్రామంలో వ్యవసాయ తోటలో పనులు చేస్తుండగా వజ్రం లభ్యం కావడంతో పెరవలికి చెందిన ఓ వ్యాపారికి రూ.1.50 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ప్రతి ఏడాది ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభ్యం కావడం సర్వసాధారణం. వ్యవసాయ కూలీకి వజ్రం లభించడంతో వారి ఇంట్లో ఆనందం నెలకొంది.
Similar News
News January 25, 2025
జలవనరుల శాఖ ఎస్ఈగా ద్వారకనాథ్ రెడ్డి
కర్నూలు జలవనరుల శాఖ ఎస్ఈగా ఎస్.ద్వారక నాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప తెలుగుగంగ ప్రాజెక్టులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ద్వారక నాథ్ రెడ్డి పదోన్నతిపై కర్నూలు ఎస్ఈగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ ఎస్ఈగా బాల చంద్రా రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.
News January 24, 2025
కర్నూలు: మెయిన్స్ పరీక్షకు 310 మంది అర్హత
కర్నూలులో 14వ రోజు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇవాళ 600 మంది అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు పిలవగా మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 310 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు.
News January 24, 2025
వినతులను త్వరితగతిన పరిష్కరించాలి: ఆదోని సబ్ కలెక్టర్
గోనెగండ్ల గ్రామంలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో తహశీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.