News August 8, 2024
బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్సీ

కుప్పం-తిరుపతి బస్సు సర్వీసును ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఆయన రిబ్బన్ కట్ చేసి, పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సును నడిపారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం పెంచులయ్య, సీఎంఏ నరసింహులు, కౌన్సిలర్లు జిమ్ దాము, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 11, 2026
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి కిలో రూ.185 నుంచి రూ.190, మాంసం రూ.268 నుంచి 290 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.305 నుంచి రూ.315 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 11, 2026
చిత్తూరు: వాట్సాప్‌లో టెట్ ఫలితాలు

చిత్తూరు జిల్లాలో టెట్ రాసిన అభ్యర్థులు వాట్సాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరిగాయని చెప్పారు. టెట్ రాసిన అభ్యర్థులు 9552300009 నంబర్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చని డీఈవో వెల్లడించారు.
News January 10, 2026
చిత్తూరు: ఘనంగా ప్రారంభమైన తైక్వాండో పోటీలు

ఐదో అంతర్ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్-2026 పోటీలు చిత్తూరు మెసానికల్ గ్రౌండ్లో ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. గ్రాండ్ మాస్టర్ బాబురావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజులపాటు జరగనున్న పోటీలలో ఏపీ, తెలంగాణతో పాటు పది రాష్ట్రాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.


