News June 22, 2024
బస్సు పాస్ కోసం User ID, Password పొందాలి: RM

విద్యార్థుల బస్సు పాసుల కోసం యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందాలని ఆర్టీసీ RM ప్రభులత తెలిపారు. ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థలు తెరుచుకున్న సందర్భంగా బస్సు పాసుల కోసం సంగారెడ్డి రీజనల్లోని 8 డిపోల్లో అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బస్సు పాసుల కోసం విద్యార్థులు వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని కళాశాలల యాజమాన్యం అప్రూవల్ చేయాలన్నారు. తర్వాత బస్సు పాస్ పొందవచ్చని అన్నారు.
Similar News
News October 17, 2025
మెదక్: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు: ఎస్పీ

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ఫ్లాగ్ డే పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ అండ్ షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లా పరిధిలో ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
News October 17, 2025
మెదక్: దీపావళి ఆఫర్ల పేరుతో మోసం: ఎస్పీ

దీపావళి పండుగ స్పెషల్ ఆఫర్ల పేరుతో సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా నకిలీ వెబ్సైట్ల ద్వారా లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ.. ఈ లింకుల ప్రలోభాలు చూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఫేక్ లింకులు, వెబ్ సైట్లలో వ్యక్తిగత వివరాలు బ్యాంకు వివరాలు ఇవ్వరాదని సూచించారు.
News October 17, 2025
మెదక్: ‘తపాలా శాఖ ద్వారా ఓటర్లకు గుర్తింపు కార్డులు’

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.