News October 23, 2024

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మున్సిపల్ ఛైర్మన్ 

image

పులివెందుల పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఉదయం మున్సిపల్ ఛైర్మన్ వర ప్రసాద్ పరామర్శించారు. ఇదే క్రమంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బందితో చర్చించారు. ఆయనతో పాటు పలువురు మున్సిపల్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 6, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,160
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,027
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.

News January 6, 2026

2025: కడప జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం ఎంతంటే.!

image

కడప జిల్లాలో 2025 సంవత్సరంలో డిసెంబర్ నాటికి మార్కెటింగ్ శాఖకు AMCల నుంచి రూ.8.28 కోట్లు ఆదాయం లభించింది. కడప-రూ.1.74 కోట్లు, ప్రొద్దుటూరు-రూ.93 లక్షలు, బద్వేల్-రూ.1.33 కోట్లు, జమ్మలమడుగు-రూ.51 లక్షలు, పులివెందుల-రూ.78 లక్షలు, మైదుకూరు-రూ.1.72 కోట్లు, కమలాపురం రూ.52 లక్షలు, సిద్దవటం-రూ.13 లక్షలు, ఎర్రగుంట్ల-రూ.44 లక్షలు, సింహాద్రిపురం-రూ.14 లక్షలు ఆదాయం లభించింది. 2024లో రూ.7.84 కోట్లు వచ్చింది.

News January 6, 2026

కడప: 4,416 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ

image

కడప జిల్లాలో ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ద్వారా రైతుల వద్ద నుంచి గిట్టుబాటు ధరతో ఖరీఫ్ సీజన్‌లో 4,416.360 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. డిసెంబర్ నెలలో 21 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వ్యవసాయ శాఖ సిబ్బంది, DCMSల ద్వారా జిల్లాలో 698 మంది రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేపట్టింది. క్వింటాకు రూ.2369 గిట్టుబాటు ధర ధర కల్పించింది. ఈ సేకరణలో చాపాడు మండలం మొదటి స్థానంలో నిలిచింది.