News September 17, 2024
బస్ భవన్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. TGSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, హెచ్వోడీలు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
HYD: జీవో 46పై హైకోర్టుకు.. రేపు విచారణ

హైదరాబాద్లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త వివాదం రాజుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అత్యంత వెనుకబడిన కుల సంఘాలు నేరుగా హైకోర్టు తలుపులు తట్టాయి. రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలంటూ అత్యవసర విచారణ కోరగా, బీసీలలో వర్గాలవారీగా న్యాయం చేయాలన్న వాదనలతో న్యాయస్థానం దృష్టి మరలింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనున్నట్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.

ఐబొమ్మ రవి: కస్టడీల పరంపర కొనసాగుతుందా?

ఐబొమ్మ రవిని పోలీసులు మరో కేసులో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీలో విచారించనున్నారు. ఈ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపనున్నట్లు తెలిసింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదుచేశారు. ఈ కేసులన్నింటినీ విచారణ జరపాలంటే కస్టడీలోకి తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారుల భావన. దీంతో మొత్తం కేసుల్లోనూ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.