News August 19, 2024
బహదూర్‌పుర: త్వరలో ZOOలోని జంతువుల కోసం యాప్

సిటీలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ సరికొత్త మార్పులు చేస్తున్నారు. జూపార్క్, జంతువుల పూర్తి వివరాలను తెలియజేసేలా అధికారులు జూ పీడియా యాప్‌ను తీసుకురాబోతున్నారు. దీని ద్వారా జూపార్కులో ఏయే జంతువు ఏ ప్లేస్‌లో ఉందో సందర్శకులు ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికోసం జంతువులకు చిప్స్ అతికించనున్నారు.
Similar News
News December 1, 2025
పాతబస్తీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

పాతబస్తీ మెట్రోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులకు అనుమతులు వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీ మెట్రోను మరింత వేగంగా నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
News December 1, 2025
HYD మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకి ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్లో సైతం ట్రాన్స్‌జెండర్లకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
News December 1, 2025
పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.


