News January 4, 2025

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : MNCL CP

image

మంచిర్యాల జోన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకూడదని CPశ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1 వరకు నిషేధాజ్ఞాలను కొనసాగిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ఆగడాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Similar News

News January 26, 2025

తాంసిలో పులి సంచారం

image

ఇటీవల భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి రిజర్వాయర్ ప్రాంతంలో పులి కనిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె శనివారం రాత్రి తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో పులి రోడ్డు దాడుతూ కనిపించినట్లు రైతులు స్వామి, అశోక్ తెలిపారు. వాహనాల లైట్ల వెలుతురుకి అది వెళ్లిపోయిందన్నారు.

News January 26, 2025

ఇంద్రవెల్లి: పాము కాటుతో రైతు మృతి

image

పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన రైతు సాబ్లె గురుసింగ్ (60) పాము కాటుకు గురై మృతి చెందాడు. శనివారం చేనులో పని చేస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు  వైద్యులు ధ్రువీకరించారు.

News January 26, 2025

ఓసీ సంఘాల ADB జిల్లా అధ్యక్షుడి రాజీనామా

image

ఓసీ సంఘాల ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు జనగం సంతోష్  తెలిపారు. సంఘ కార్యకలాపాలకు న్యాయం చేయకపోవటంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజీనామా లేఖను జాతీయ కార్యవర్గానికి సమర్పించినట్లు పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.