News February 19, 2025
బహుళ పంటల విధానంపై రైతుల్లో చైతన్యం: కలెక్టర్

లాభదాయక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలల్లో ప్రతి ఇంటి వద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 22, 2025
విశాఖ: షికారుకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య

అనకాపల్లి గవరపాలెం సాగిదుర్గరాజు వీధిలో ఈనెల 19న ఆత్మహత్యకు ప్రయత్నించిన మంగారపు జ్యోతి(29) చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త షేక్ అబ్దుల్ ఘనితో కలిసి ఆమె తన పుట్టింటికి వెళ్లింది. 19న తనను బయటకు తీసుకెళ్లాలని భార్య కోరింది. ఇప్పుడు బయటకు ఎందుకని ఆమె తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురై మేడపైకి వెళ్లి ఉరేసుకుంది. వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.
News February 22, 2025
ఘనంగా విశాఖ తొలి మేయర్ NSN రెడ్డి జయంతి

విశాఖ నగర మొదటి మేయర్ NSN రెడ్డి 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి శనివారం పూలమాలలు వేశారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొని ఎన్.ఎస్.ఎన్.రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషిచేసిన ప్రజా నాయకుడు ఎన్.ఎస్.ఎన్.రెడ్డి అని కొనియాడారు.
News February 22, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజిపాలెం మెయిన్ రోడ్‌లో పెట్రోల్ బంక్ సమీపంలో బైక్‌ను లారీ ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. బైక్ నంబర్ AP40CS0114 ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.