News August 18, 2024

బహ్రెయిన్‌లో కోనసీమ యువకుడి ఆత్మహత్య

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకకు చెందిన నాగులపల్లి వీర వెంకట దుర్గానాగసాయి(22) బహ్రెయిన్‌లో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులకు సమాచారం అందింది. మృతుడి మేనమామ ఉండపల్లి రమేశ్ ఆదివారం ఈ విషయం తెలిపారు. గత నెల 29న పెట్రోల్ బంక్‌లో పని చేసేందుకు నాగ సాయి వెళ్లాడన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని, విచారణ జరిపించాలని, మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కోరారు.

Similar News

News September 15, 2025

తూ.గో పోలీస్ గ్రీవెన్స్‌కు 40 అర్జీలు

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”లో 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మురళీకృష్ణ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సంబంధిత పొలీసు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానకి కృషి చేశారు. అర్జీలలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయన్నారు.

News September 15, 2025

రాజమండ్రి: కలెక్టరేట్ PGRSలో 152 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహించరాదని, నిర్ణీత సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 152 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

News September 15, 2025

రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.