News April 8, 2025
బాంబులు అమర్చాం.. అక్కడికి వెళ్లొద్దు: ‘మావో’ లేఖ

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టపైకి స్థానిక ప్రజలు వెళ్లవద్దని సీపీఐ మావోయిస్టు వెంకటాపురం-వాజేడు కార్యదర్శి శాంత పేరుతో లేఖను విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి తాము కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్లు తెలిపారు. ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలు పోలీసుల మాయమాటలు నమ్మి వేట పేరుతో కర్రెగుట్టలపైకి వెళ్లొద్దని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
ఖమ్మం: ఏఎస్సైలుగా 10 మందికి పదోన్నతి

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన 10 మంది హెడ్ కానిస్టేబుళ్లను కమిషనర్ కార్యాలయంలో సోమవారం పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. ఏఎస్సైగా పదోన్నతి పొందిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.
News December 22, 2025
VZM: ‘PMAGY పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి’

ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (PMAGY) పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈ పథకం అమలుపై సోమవారం సమీక్ష జరిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 500 జనాభా కలిగి, 40% ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. జిల్లాలోని మెరకముడిదాం, వంగర, తెర్లాం, ఆర్.ఆమదాలవలస మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని ప్రతిపాదించారు.
News December 22, 2025
మిడిల్ క్లాస్కు సొంతింటి ముప్పు.. HPI రేషియో తెలుసా?

సొంతిళ్లనే ధీమా కోసం ‘మిడిల్ క్లాస్’ రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. ఇప్పుడది జీవితకాల కష్టానికి పెరిగింది. దీన్ని HPI(House Price to Income) రేషియోతో కొలుస్తారు. 3-6ఏళ్ల జీతంతో ఇళ్లు కొనగలిగితే సేఫ్. కానీ ముంబైలో ఓ వ్యక్తి 34Y జీతం వెచ్చించాల్సిందే. ఇది బెంగళూరులో 22, ఢిల్లీలో 20, పుణేలో 18Yగా ఉంది. హాంకాంగ్ 21, లండన్ 13, సింగపూర్ 11, న్యూయార్క్ 9Yగా ఉంది. మీ ప్రాంతంలో ఈ రేషియో ఎలా ఉంది?


