News September 19, 2024

బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ పోస్టు

image

నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ పోస్టు ఇచ్చింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1 పోస్టు అయిన డీఎస్పీగా నిఖత్ జరీన్ నియమించింది.

Similar News

News October 3, 2024

NZB: గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్

image

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం బాసరలో చోటుచేసుకుంది. ఎస్ఐ గణేశ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన దత్తు (45) ఆరునెలల కిందట ఆయన యాసిడ్ తాగాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News October 3, 2024

NZB: ఢిల్లీ పోలీసులమంటూ బెదిరించి.. నిట్టనిలువునా దోచారు!

image

పోలీసులమని బెదిరించి లక్షలు కాజేసిన ఘటన NZB జిల్లాలో జరిగింది. బాధితుల ప్రకారం.. ‘పోలీసులం మాట్లాడుతున్నాం.. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో ఉన్నావు.. అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారు’ అని కామారెడ్డికి చెందిన కిషన్ రావుకు ఫోన్ చేశారు. దీంతో భయపడిన బాధితుడు సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు రూ.9,29,000 బదిలీచేశాడు. మోసమని గ్రహించి 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 3, 2024

NZB: డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 220 మంది హాజరు

image

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది.ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 220 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, అభ్యర్థుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్‌కు సమాచారం వచ్చిన వారు మాత్రమే హాజరుకావాలని అధికారులు సూచించారు.