News March 11, 2025
బాక్స్ క్రికెట్ టోర్నమెంట్లో మల్యాల జట్టు విజయం

జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో సోమవారం బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్‌కు వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నీలో మల్యాల మండలం జట్టు ఫైనల్లో విజయం సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు.
Similar News
News March 27, 2025
ASF: ‘సంక్షేమ పథకాల అమలు పకడ్బందీగా చేపట్టాలి’

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌తో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
News March 27, 2025
ప్రభాస్ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెను ఆయన వివాహం చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని ఖండించింది. అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతకుముందు భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
News March 27, 2025
ఇంజనీరింగ్ కళాశాలను కరీంనగర్‌లోనే ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ

శాతవాహన యూనివర్సిటీకి నూతనంగా ఇంజనీరింగ్, లా కళాశాలలు మంజూరు కాగా.. ఇంజనీరింగ్ కలశాలను హుస్నాబాద్‌కు తరలిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీలో వీసీకి వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళశాలను కరీంనగర్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, అజయ్, విష్ణు, అంజన్న, కిరణ్మయి, నందు ఉన్నారు.