News September 30, 2024
బాగా చదవాలన్నందుకు కాలువలో దూకిన విద్యార్థి
బాగా చదివి పదో తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పినందుకు ఓ విద్యార్థి కాలువలో దూకేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారావుకు కుమారుడు పోలినాయుడు(16), కుమార్తె సంతానం. ఆదివారం కుమార్తె పుట్టిన రోజు వేడుకలను పెద్దింటమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. ఈ క్రమంలో పేరెంట్స్, బంధువులు ‘పది’లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పోలినాయుడితో అనగా.. మనస్తాపానికి గురై వెళ్లి కాలువలో దూకేశాడు.
Similar News
News October 5, 2024
ఏలూరు: రైతులకు మంత్రి విజ్ఞప్తి
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్‌మిల్లును సంప్రదించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో ఇప్పటికే 7 లక్షల గోనెసంచులు అందుబాటులో ఉంచామన్నారు.
News October 4, 2024
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గోపి మూర్తి
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నికకు పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా. గోపి మూర్తిని యుటీఎఫ్ బలపరిచింది. ఈ మేరకు ఆయన్ను బరిలో ఉంచాలని నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
News October 4, 2024
ఏలూరు: ‘రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలి’
రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం రూపకల్పన లో భాగంగా వచ్చే ఐదేళ్లకు జిల్లా స్థాయి దార్శనిక పత్ర రూపకల్పన కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.