News April 16, 2025
బాచుపల్లి: నమ్మించి మోసం చేశాడు

పెళ్లికాలేదు.. నిన్నే చేసుకుంటా అని నమ్మించి యువతి (21)ని గర్భవతిని చేసి మొహం చాటేశాడో కామాంధుడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా కటకటాల పాలయ్యాడు. సీఐ ఉపేందర్ మాటల్లో.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ (43) మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నాను అంటూ మల్లంపేటలోని హోటళ్లకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేగా మొహం చాటేశాడు.
Similar News
News April 19, 2025
హైదరాబాద్: సీఎం పర్మిషన్ కోసం వెయిటింగ్

నగరంలో అక్కడక్కడా రోడ్లు దెబ్బతినగా వాటికి మరమ్మతులు చేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆ పనుల కోసం టెండర్లు పిలవాల్సి ఉందంటున్నారు. నగరంలో దాదాపు 744 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులకు రూ.2,491 కోట్లు కావాలని అందుకోసం ఇప్పటికే సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. సీఎం రేవంత్ అనుమతి లభించిన తరువాత పనులు ప్రారంభం అవుతాయని అంటున్నారు.
News April 19, 2025
బేగంపేట: యముడు, చిత్రగుప్తుడి అవతారం ఎత్తారు

బేగంపేట చౌరస్తాలో NIPPON ఎక్స్‌ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో పోలీసులు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీటు బెల్టులేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు, CI రామచందర్, బోస్‌కిరణ్, SI భూమేశ్వర్, NIPPON సుధీర్ నాయర్, కలీంఅలీ, అనిల్, ప్రియాంక సుధాకర్ సిబ్బంది ఉన్నారు.
News April 19, 2025
HYDలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

SEC రాంగోపాల్ పేట్ బాపుబాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి, ముఠాలోని అవియాజ్, హుస్సేన్‌లను అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం HYDకు వచ్చిన అమాయకపు యువతులను స్వప్న అనే మహిళ ఈ కూపంలోకి దించుతోందని గుర్తించారు. ఈ ముఠాలోని లడ్డు, స్వప్న పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.