News February 10, 2025

బాజీరావు మహారాజ్ బోధనలు ఆచరణీయం: రూపేశ్ రెడ్డి

image

ఆధ్యాత్మిక గురువు బాజీరావు మహారాజ్ భౌతికంగా దూరమైన ఆయన బోధనలు ఆచరణీయమని, వేలాది మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి అన్నారు. బేల మండలంలోని చెప్రాల గ్రామంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న బాజీరావ్ మహారాజ్ సప్త వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ఆయన హాజరై మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పల్లకిని గ్రామంలో ఊరేగించారు.

Similar News

News February 11, 2025

ADB: 7ఏళ్లయినా ఉద్యోగం ఇవ్వట్లేదని వాపోయిన యువతులు

image

స్టాఫ్ నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఈ విషయమై సోమవారం ఉట్నూర్, గాదిగుడా నుంచి బాధితులు శైలజ, విజయలక్ష్మి, నీల ప్రజావాణికి వచ్చారు. అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి విన్నవించారు. ట్రైనింగ్ పూర్తి చేసి 7 సంవత్సరాలు అవుతుందన్నారు. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకున్నా తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు.

News February 11, 2025

ADB: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా చించ్ ఖేడ్‌కు చెందిన గోటి జితేందర్ బజర్హత్నూర్ మండలానికి చెందిన ఓ బాలికను ముంబైకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

News February 11, 2025

ADB: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన జర్నలిస్ట్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదిలాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులగం దేవిదాస్ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే జర్నలిస్టులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!