News July 6, 2024
బాడంగి: రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

బాడంగి మండలం గొల్లాది సమీపంలోని నక్కలబంద వద్ద రైలు ఢీకొని గొల్లాదికి చెందిన మన్నెల(48) శుక్రవారం మృతి చెందాడు. జీఆర్పీ హెచ్‌సీ ఈశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు వెళ్తూ పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకీ మృతదేహాన్ని తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
VZM: కానిస్టేబుల్‌గా ఎంపికైన వారికి గమనిక

ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులు ఈనెల 15న జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలని SP ఏ.ఆర్.దామోదర్ బుధవారం తెలిపారు. ఈనెల 16న మంగళగిరి బెటాలియన్‌లోని పెరేడ్ మైదానంలో CM చంద్రబాబుతో ముఖాముఖి అనంతరం అక్కడే వీరికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని, PTC, DTCలో అభ్యర్థులు ఈనెల 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.
News December 10, 2025
VZM: పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అధికారులకు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ స్థాయిలోనే రాజీ అయ్యే అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ కేసులు, చిన్న క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, పెండింగ్ చలాన్లను ముందుగా గుర్తించాలని సూచించారు.
News December 10, 2025
విజయనగరం: మా జీతాలు ఇవ్వండి సార్..!

విజయనగరం జిల్లాలో ఆర్ అండ్ బీ, జలవనరులు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ సహా ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగస్థులకు 10వ తేదీ వచ్చినా కూడా ప్రభుత్వం జీతాలు వేయలేదని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎల్వీ యుగంధర్ని ఏపీసిపిఎస్ఈఏ సభ్యులు కలిసి సమస్యను విన్నవించుకున్నారు. ఈ విషయంపై ఎస్టీఓ అమరావతి అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.


