News May 4, 2024

బాడంగి: రైలు పట్టాలపై మృతదేహం లభ్యం

image

చెడు వ్యసనాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాడంగి మండలంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ బీ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కోటిపల్లి గ్రామానికి చెందిన బోను వెంకటరమణ(21) తాగుడు, బెట్టింగ్‌కు అలవాటు పడినట్లు తెలిపారు. జీవితంపై విరక్తి చెంది శనివారం డొంకినవలస ఎత్తు బ్రిడ్జి సమీపంలో రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.

Similar News

News January 8, 2026

నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్‌ఎస్‌లో వివరాల అప్‌లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్‌బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.

News January 8, 2026

వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.