News January 27, 2025
బాడీ బిల్డింగ్ పోటీలో తాండూరు వాసికి గోల్డ్ మెడల్

బాడీ బిల్డింగ్ పోటీలో తాండూరు పూజారి కుమారుడు సత్తా చాటాడు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు కోటేశ్వర స్వామి దేవాలయం పూజారి చంద్రశేఖర్ స్వామి కుమారుడు అభిషేక్ స్వామి ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 55 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్, మ్యాన్ ఫిజిక్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ మేరకు డాక్టర్ సమత్ కుమార్ అభినందించారు.
Similar News
News November 8, 2025
పావలా వడ్డీకే రుణాలు: తిరుపతి కలెక్టర్

KVBపురం(M)లో రాయల చెరువు తెగి ఐదు ఊర్లు నీట మునిగిన విషయం తెలిసిందే. వరద ధాటికి 57 మూగ జీవులు(26 ఆవులు, 18 గేదెలు, 13 గొర్రెలు) చనిపోయినట్లు సమాచారం. కొట్టుకుపోయిన జీవాలు కొన్ని ఇంటి బాట పట్టాయి. పశువులను కోల్పోయిన వారిని నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు డ్వాక్రా ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారన్నారు.
News November 8, 2025
కరీంనగర్ జిల్లా ప్రగతిపై గవర్నర్ సమీక్ష

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 8, 2025
KNR: విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా KNR జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించి సవివరంగా వివరించారు.


