News January 27, 2025
బాడీ బిల్డింగ్ పోటీలో తాండూరు వాసికి గోల్డ్ మెడల్

బాడీ బిల్డింగ్ పోటీలో తాండూరు పూజారి కుమారుడు సత్తా చాటాడు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు కోటేశ్వర స్వామి దేవాలయం పూజారి చంద్రశేఖర్ స్వామి కుమారుడు అభిషేక్ స్వామి ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 55 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్, మ్యాన్ ఫిజిక్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ మేరకు డాక్టర్ సమత్ కుమార్ అభినందించారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ ఘన విజయం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు. BRS అభ్యర్థి మాగంటి సునీతపై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిన నవీన్.. ఈసారి ఉపఎన్నికలో సత్తా చాటారు. దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో జూబ్లీహిల్స్ అడ్డాలో కాంగ్రెస్ జెండా పాతారు.
News November 14, 2025
సా.5 గంటలకు సీఎం రేవంత్ ప్రెస్‌మీట్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సా.5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సా.4 గంటలకు మంత్రులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే.
News November 14, 2025
రెయిన్‌బో డైట్ గురించి తెలుసా?

బరువు తగ్గడానికి కొందరు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇంకొందరు, కండలు తిరిగిన దేహం కోసం మరికొందరు రకరకాల డైట్ ప్లాన్‌లను అనుసరిస్తున్నారు. వాటిల్లో ఒకటే రెయిన్‌బో డైట్. పళ్లెంలో రంగురంగుల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలకు చోటు కల్పించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనిద్వారా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయంటున్నారు.


