News December 22, 2024
బాడీ బిల్డింగ్ పోటీల్లో కంబకాయ వాసికి గోల్డ్ మెడల్
బాడీ బిల్డింగ్ పోటీల్లో నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన పాగోటి సతీష్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇటీవల డిసెంబర్ 20,21వ తేదీలలో వెస్ట్ బెంగాల్‌లోని న్యూ కోచ్ బెహర్‌లో జరిగిన ఇండియన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ఈయన పాల్గొన్నారు. అండర్ 23 పోటీల్లో తన విజయం సాధించానని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కోచ్‌లు సోమేశ్, చిరంజీవిలు సతీష్‌ను అభినందించారు. ఈ క్రమంలో కోచ్‌లకు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 23, 2024
అనకాపల్లిలో శ్రీకాకుళం వ్యక్తులకు గాయాలు
అనకాపల్లి మండలం కాపుశెట్టివానిపాలెంలో ఆదివారం మూడు అంతస్తుల భవనంపై నుంచి పడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. ఆదివారం భవన నిర్మాణ కార్మికులు పని చేస్తుండగా డెకింగ్ కర్రలు విరిగిపోయాయి. క్షతగాత్రులను 108లో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీరు చిన్నారావు, లోపల్లి సోమేశ్వర రావు, ఒడిశాకు చెందిన కృష్ణా రావుకు తీవ్ర గాయాలయ్యాయి.
News December 23, 2024
SKLM: నేడు క్రిస్టమస్ హైటీ వేడుకలకు ఆహ్వానం
క్రిస్టమస్ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 25 క్రిస్టమస్ సందర్భంగా సోమవారం కోడిరామూర్తి స్టేడియం పక్కన గల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదికలో హైటీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ పెద్దలు, జిల్లాలోని ఆయా సంఘాలకు సంబంధించి సంఘ కాపరులు హాజరై విజయవంతం చేయాలన్నారు.
News December 22, 2024
SKLM: చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
కవిటి పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి మీడియాతో వివరాలు వెల్లడించారు. ఇదే వ్యక్తి కవిటి, కంచిలి, ఇచ్చాపురం పట్టణాల్లో చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. రూ.7,76,958 మొత్తం విలువ గల ఎనిమిదిన్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.