News March 18, 2025

బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ 

image

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.

Similar News

News February 24, 2026

కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్!

image

ఝార్ఖండ్‌లోని రాంచీలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఏడుగురితో ఢిల్లీకి బయల్దేరిన కాసేపటికే ఛత్రా జిల్లాలోని కర్మటండ్ గ్రామంలో క్రాష్ అయింది. ఒకరు చనిపోయారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

News February 24, 2026

రక్షణ రంగ అభివృద్ధికి ఏపీ కీలకం: జి. సతీష్ రెడ్డి

image

విశాఖ డిఫెన్స్ స్టార్టప్ సదస్సులో రక్షణ శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తీరప్రాంతం, పారిశ్రామిక వసతులు రాష్ట్రానికి బలమని, స్టార్టప్స్ భాగస్వామ్యంతో అధునాతన పరికరాల తయారీ సాధ్యమని చెప్పారు. సముద్ర భద్రతే దేశ ఆర్థిక భద్రతకు మూలస్తంభమని, స్వదేశీ సాంకేతికతతో ఇండో-పసిఫిక్‌లో భారత ప్రయోజనాలను కాపాడవచ్చని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పేర్కొన్నారు.

News February 24, 2026

జింబాబ్వే ఘోర ఓటమి

image

T20 WCలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఘోరంగా ఓడిపోయింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ZIM 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఏ దశలోనూ ఛేదన దిశగా సాగలేదు. ముగ్గురు డకౌట్ అయ్యారు. చివర్లో ఇవాన్స్(43) కాసేపు మెరుపులు మెరిపించారు. మోతీ 4, హొసీన్ 3, ఫోర్డె 2, హోల్డర్ ఒక వికెట్ తీశారు.