News March 18, 2025
బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.
Similar News
News April 19, 2025
ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
News April 19, 2025
వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం

కాకినాడ జిల్లాలో ఓ మాజీ వైసీపీ ఎమ్మెల్యే గత ప్రభుత్వ హయంలో బ్రాహ్మణ, దేవాదాయ భూములు కాజేశాడని Dy.CM పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఆయన కార్యాలయానికి భూకబ్జాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌లో పేషీ అధికారులతో మాట్లాడారు. కాకినాడ జిల్లా, నగరంలో కబ్జాకు గురైన భూముల గురించి ప్రస్తావించారు. అధికారులు అక్కడికి వెళ్లి విచారించాలని ఆదేశించారు.
News April 19, 2025
గన్నవరం: లారీ డ్రైవర్‌కు గుండె పోటు.. ఇద్దరి దుర్మరణం

విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌కు ప్రసాదం పాడు వద్ద గుండెపోటు రావడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఫుట్ పాత్‌పై లారీ దూసుకెళ్లడంతో నడుచుకొని వెళ్తున్న రామసాయి(18) స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పామర్రుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.