News March 28, 2025

బాధితులకు సత్వర న్యాయం అందించండి: జేసీ

image

షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, అణగారిన వర్గాల ప్రజలపై దాడులు, అత్యాచారానికి గురైన బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ సీ.విష్ణు చరణ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సఫాయి కర్మచారులు జీతభత్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ అన్నారు.

Similar News

News November 23, 2025

నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

image

పుట్టపర్తిలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హెలికాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే బాబా శతజయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. 11 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి దర్శించుకుంటారు. 11.45 గంటలకు సత్యసాయి విమానాశ్రయం నుంచి తిరుగుపయనం అవుతారు.

News November 23, 2025

ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

image

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

News November 23, 2025

మెదక్‌లో JOBS.. APPLY NOW

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్‌లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్‌లో సమర్పించాలని తెలిపారు.