News September 13, 2024

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలం: ధర్మాన

image

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఇచ్చాపురంలో స్థానిక నాయకులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 14, 2024

SKLM: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న 158 మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. 158 మద్యం దుకాణాలకు 4,671 దరఖాస్తులు అందాయి. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News October 14, 2024

SKLM: DSC అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

DSC రాయనున్న SC,ST అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ DD విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు 3 నెలల పాటు శిక్షణ పొందేందుకు ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http:jnanabhumi.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 22 నుంచి 25లోగా హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు.

News October 14, 2024

SKLM: నేడు మద్యం దుకాణాలు లాటరీ

image

శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాలను సోమవారం లాటరీ పద్ధతిలో దరఖాస్తుదార్లకు కేటాయించనున్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు గాను, 4670 దరఖాస్తులు వచ్చాయి. మద్యాన్ని ప్రయివేట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం వెలువరించిన విధివిధానాలకు లోబడి ఈప్రక్రియ జరగనుంది. స్టేషన్ల వారీగా ఆడిటోరియంలోకి పిలిచి లాటరీ తీస్తారు.