News June 2, 2024
బాధ్యతగా విధులు నిర్వహించాలి: ఎస్పీ
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు బందోబస్తు విధులలో పాల్గొననున్న ఏఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు శనివారం ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ బందోబస్తులో పాటించవలసిన విధి విధానాలపై ఎస్పీ జీఆర్ రాధిక బ్రీఫింగ్ నిర్వహించారు. సిబ్బందికి కేటాయించిన పాయింట్‌లో బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లు ఘర్షణలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 8, 2024
శ్రీకాకుళంలో రేపు విద్యా సంస్థలకు సెలవు
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కళాశాలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం కలెక్టర్ దినకర్ సెలవు ప్రకటించారు. వర్షాలు సోమవారం కూడా కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదేశాలను ఎవరూ పాటించక పోయిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 8, 2024
శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రానున్న 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మత్స్యకారులు 3 రోజులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557కు ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ cosklmsupdtd@gmail.com ద్వారా ఫొటోలను పంపించాలని తెలిపారు.
News September 7, 2024