News June 19, 2024
బాధ్యతలు చేపట్టిన ఆర్టీసీ ఆర్ఎం విజయభాను
వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌గా విజయభాను బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని చార్మినార్ డివిజన్ డిప్యూటీ ఆర్.ఎంగా పనిచేసిన విజయభాను పదోన్నతిపై వరంగల్ ఆర్.ఎంగా బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన శ్రీలత రంగారెడ్డి ఆర్.ఎంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన విజయభానును ఆర్టీసీ అధికారులు, కార్మిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News September 8, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> MLG: శివాపూరులో గుండెపోటుతో వృద్ధురాలు మృతి
> BHPL: గణపురంలో పీడీఎస్ బియ్యం పట్టివేత
> MLG: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లారీ
> MHBD: అనారోగ్యంతో సీపీఎం నాయకురాలు మృతి
> MLG: పేరూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
> MHBD: అనారోగ్యంతో జర్నలిస్టు మృతి
> MLG: గ్యాస్ సిలిండర్లు దొంగలిస్తున్న తల్లి కూతుల్లు అరెస్ట్
News September 8, 2024
వరంగల్: ఎన్పీడీసీఎల్‌లో అవినీతి నిర్మూలించడానికి శ్రీకారం
టీజీ ఎన్పీడీసీఎల్‌లో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఎవరైనా లంచం అడిగితే ఉపేక్షించదని యాజమాన్యం తెలిపింది. సంస్థలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సాధించామని అన్నారు. సేవలకు ప్రతిఫలంగా లంచం అడిగితే 9281033233, 1064కు కాల్ చేయాలని తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిల్లో అన్ని కార్యాలయంలో పోస్టర్లను పెట్టడం జరిగిందన్నారు.
News September 8, 2024
దీప్తిని సన్మానించిన మంత్రి సీతక్క
పారాలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన దీప్తి జీవంజిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పథకం సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీతక్క అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.