News May 20, 2024

బాధ్యతలు స్వీకరించిన పల్నాడు నూతన కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జయింట్ కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

Similar News

News December 1, 2025

గుంటూరులో 2,56,904 మందికి రూ.111.34కోట్ల పంపిణీ

image

జిల్లాలో ప్రతి నెల 2,56,904 మందికి లబ్దిదారులకు రూ.111.34కోట్ల పంపిణీ జరుగుతోంది. వీరిలో వృద్ధాప్యపు పింఛన్‌లు 1,18,174, వితంతు 70,112, చేనేత 3,862, గీతకార్మికులు 443, మత్స్యకారులు 570, ఒంటరి మహిళలు 11,330, చర్మకారులు 876, హిజ్రాలు 67, HIV బాధితులు 2,614, కళాకారులు 77, డప్పు కళాకారులు 854, దివ్యాంగులు 24,835, వైద్య సంబంధిత 1667, సైనిక సంక్షేమం 28, అభయహస్తం 3,994, అమరావతి భూముల సంబంధిత 17,401మంది.

News December 1, 2025

అమరావతిలో రూ.750 కోట్లతో యోగా, నేచురోపతి ఇన్‌స్టిట్యూట్

image

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ‘ఎపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి’ ఏర్పాటు కానుంది. దీనికోసం త్వరలో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ. 750 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అలాగే యోగా, నేచురోపతి కోర్సుల్లో 100 (UG), 20 (PG) సీట్లతో విద్యావకాశాలు కల్పించనున్నారు.

News December 1, 2025

GNT: శీతాకాల సమావేశాలు.. ఎంపీ స్టాండ్ ఏంటి.!

image

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ & ప్రాజెక్టులు, పోలవరం, అమరావతి క్యాపిటల్ రీజన్ అభివృద్ధి నిధులు, రైల్వే & రోడ్ ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, నూతన ప్రాజెక్టులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.