News September 20, 2024
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రమేశ్
తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఈ సంఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
Similar News
News October 5, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.
News October 5, 2024
విశాఖలో అర్ధరాత్రి దారుణ హత్య
విశాఖలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మల్కాపురంలోని యువకుడు వాసుకు తన సోదరులతో వివాదం చోటు చేసుకోగా ఈ ఘటన జరిగింది. వాసు తలపై రాడ్డుతో కొట్టడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 4, 2024
ఏయూకి ఐఎస్ఓ సర్టిఫికేషన్
ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికేషన్ 2027 వరకు ఈ గుర్తింపు అందించింది. ఇటీవల ఏయూను సందర్శించిన ఐఎస్ఓ నిపుణుల బృందం ఏయూలో వివిధ అంశాలను పరిశీలించి ఈ గుర్తింపును కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలు ఏయూ ఐక్యూ ఏసీ సమన్వయకర్త ఆచార్య జి.గిరిజా శంకర్ స్వయంగా ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణ రావుకు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.