News August 13, 2024

బాన్సువాడలో ఉపఎన్నిక ఖాయం: KTR

image

బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ శ్రేణులు మంగళవారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని బీఆర్ఎస్‌కు కార్యకర్తలే కొండంత అండ అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారంను ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News September 18, 2024

NZB: ఈ నెల 19న సర్టిఫికేట్ పరిశీలన

image

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో మిగిలిన PGCRT, CRT, PETలతో పాటు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో CRT ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు NZB జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు deonizamabad.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాతాలో పేరున్న అభ్యర్థులు ఈ నెల 19న కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయానికి సర్టిఫికేట్ పరిశీలనకు రావాలన్నారు.

News September 18, 2024

పిట్లంలో రికార్డు ధర పలికిన లడ్డూ

image

పిట్లం మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనిలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద మంగళవారం రాత్తి మహా లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు. హోరా హోరీగా సాగిన వేలం పాటలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీపీ సరిత, సూరత్ రెడ్డి దంపతులు రూ.5,01,000కు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గణేశ్ మండలి సభ్యులు వారిని ఘనంగా సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు.

News September 17, 2024

NZB: డిఫెన్స్ మినిస్టర్‌ను కలిసిన ఎంపీ అరవింద్

image

కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రంజిత్ సింగ్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ నివాస గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎంపీ అరవింద్ చేసే ప్రతి కార్యక్రమాల విషయంలో డిఫెన్స్ మినిస్టర్ సలహా సూచనలను తీసుకునే నేపథ్యంలో ఆయనతో కలిసి ఫ్లవర్ బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.