News January 16, 2025
బాన్సువాడ: అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్ష సమావేశం

బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి తహాసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 18, 2025
NZB: ఎస్ఐని ఢీకొని పరారైన కారు

వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐను ఓ వ్యక్తి కారుతో ఢీకొని పరారైన ఘటన NZBలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి RR చౌరస్తాలో 4వ టౌన్ ఎస్ఐ-2 ఉదయ్ వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆయణ్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐకి గాయాలయ్యాయి. సిబ్బంది ఎస్ఐని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వాహనం ఆపకుండా పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
News February 18, 2025
ముప్కాల్: కాల్వలో పడి రైతు దుర్మరణం

ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన కోమటి శెట్టి చిన్నయ్య (46) అనే రైతు ప్రమాదవశాత్తు శ్రీరామ్ సాగర్ కాకతీయ కాల్వ లో పడి మృతి చెందినట్లు ఎస్ఐ రజినీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకతీయ కాల్వ మోటార్ ద్వారా తన చేనుకు నీరు అందించుకుంటున్నాడు. మోటర్‌లో నీరు తక్కువగా రావడంతో కాల్వలోకి దిగి నాచు తొలగించుతుండగా నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో కొట్టుకపోయాడు.
News February 18, 2025
NZB: స్టేట్ లెవెల్ స్కేటింగ్‌లో జిల్లా క్రీడాకారులకు మెడల్స్

స్టేట్ లెవెల్ స్కేటింగ్‌లో జిల్లా స్వెటర్లు మెడల్స్ సాధించారు. హైదరాబాదులో నిర్వహించిన 13వ ఎస్ ప్రో ట్విన్ సిటీస్ రోలర్ స్కేటింగ్ రాష్ట్రస్థాయి స్కేటింగ్ లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ ప్రదర్శించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి వివిధ కేటగిరీలలో సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొనగా 8 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్ మెడల్స్, 10 బ్రాంజ్ మెడల్స్ సాధించారు.