News April 15, 2025
బాన్సువాడ: అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాన్సువాడ కల్కి చెరువులో గంగమణి(45) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం పోలీసులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంతో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News December 16, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News December 16, 2025
NTR: న్యూ ఇయర్ కానుకగా ‘ఆంధ్ర టాక్సీ యాప్’

ఆటో, టాక్సీ డ్రైవర్ల కోసం కమిషన్ లేకుండా ‘ఆంధ్ర టాక్సీ’ యాప్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓలా, రాపిడోలో 30% వరకు కమిషన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఉపశమనం కలిగించనుంది. ఈ యాప్ను మొదట ఎన్టీఆర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద జనవరి 1న ప్రారంభించనున్నారు. దీనిని పర్యాటక ప్రాంతాలకు అనుసంధానించి ప్రత్యేక ప్యాకేజీలు అందించనున్నారు. రేపటి నుంచి డ్రైవర్లకు అవగాహన కల్పిస్తారు.
News December 16, 2025
తూ.గో: ధనుర్మాసం వచ్చేసింది.. సంక్రాంతి సందడి తెచ్చేసింది..!

ధనుర్మాసం వచ్చేసింది. మంచు తెరలు గోదారి అలలను ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. బరిలోకి కాలు దువ్వేందుకు పందెం కోళ్లు సై అంటుంటే, అత్తారింటికి రావడానికి కొత్త అల్లుళ్ల ఎదురు చూస్తున్నారు. సిటీల్లో ఉన్నా సరే, మనసుని లాగేసే గోదారి మట్టి వాసన, అమ్మమ్మ గారి ఊరి జ్ఞాపకాలు సంక్రాంతి ప్రత్యేకత. ఇది కేవలం పండగ కాదు.. గోదారోడి గతాన్ని, వర్తమానాన్ని ముడివేసే ఒక తీయని అనుభూతి.


