News April 8, 2025
బాన్సువాడ: గుండెపోటుతో హోంగార్డు మృతి

బాన్సువాడ రూరల్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సాయిలు(55) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన సోమవారం విధులు నిర్వహించి స్వగ్రామమైన దేశాయిపేట్లోని ఇంటికి వెళ్లారు. తరువాత ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హోంగార్డు సాయిలు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.
Similar News
News November 19, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 121 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 121 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 51 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
News November 19, 2025
ఆ భయంతోనే ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి!

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయాడన్నారు.
News November 19, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 5 ఇసుక ట్రాక్టర్లు సీజ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో 5 కేసులు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 15 టన్నుల ఇసుకతో పాటు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట పరిధిలో నాలుగు, పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది.


