News March 26, 2025

బాన్సువాడ: పెళ్లై నెలే.. నవవధువు ఆత్మహత్య

image

బాన్సువాడలోని కొల్లూరులో లక్ష్మీ, వెంకటేశ్‌లకు FEB 23న వివాహం జరిగింది. అయితే ఇష్టంలేని పెళ్లి చేయడంతోనే లక్ష్మీ మంగళవారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ అశోక్ తెలిపారు. సూసైడ్ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. మృతురాలి తల్లి చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

Similar News

News October 19, 2025

కరీంనగర్: SU డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

SU పరిధిలో BA, B.com, Bsc, BBA కోర్సుల్లో 1వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా OCT 27 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో OCT 29 వరకు చెల్లించుకోవచ్చని SU పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పరీక్షలు NOV 13 నుంచి నిర్వహించనున్నారు.

News October 19, 2025

చిత్తూరు తాలూకా SI సస్పెండ్

image

చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు SP తుషార్ డూడీ ఆదేశాలు జారీ చేశారు. మల్లికార్జునపై పలు ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఓ బాధితుడు SI ఆడియో రికార్డును కలెక్టర్, ఎస్పీకి పంపినట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ జరిపిన ఎస్పీ చర్యలు తీసుకున్నారు.

News October 19, 2025

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పొన్నూరు ఎమ్మెల్యే భేటీ

image

సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయుడుపేట పట్టణంలోని ఆమె నివాసంలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే, సంగం మిల్క్ డైరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంగం డైరీ మేనకూరు సెజ్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు అవుతుండగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలపై ఇరువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. సంగం డైరీ రైతులకు, పాల ఉత్పత్తిదారులకు ఆశాకిరణమని ధూళిపాల నరేంద్ర తెలిపారు.