News March 29, 2025
బాన్సువాడ: పైపులతో కొట్టి హత్య చేశారు

బాన్సువాడ మండలం నాగారం గ్రామానికి చెందిన అమృతం విట్టల్ శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. సీఐ అశోక్ వివరాలు.. కొల్లూరు శివారులో ఇద్దరు వ్యక్తులతో కలిసి విట్టల్ మద్యం తాగారు. అనంతరం వారు విట్టల్ను పైపులతో కొట్టి హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదం జరిగినట్లు ప్రయత్నించారు. మృతుడి సోదరుడు సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతుని భార్యను, మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు.
Similar News
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.
News November 24, 2025
డ్రగ్స్ కేసుల్లో గత 16 నెలల్లో 2,467 మంది అరెస్ట్: DIG

గత 16 నెలల్లో 2,467 మంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినట్లు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. విజయనగరంలో సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కుటుంబాలు, భవిష్యత్తు, వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతింటుందని, గంజాయి లేదా డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం ఏదైనా చేస్తే జైలుశిక్ష తప్పదన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు 1000 కి.మీ ‘అభ్యుదయం సైకిల్ ర్యాలీ’ చేపట్టామన్నారు.
News November 24, 2025
పెద్దపల్లి: ప్రజావాణిలో ఆర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్న ఆయన, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు సమర్పించారు.


