News October 17, 2024
బాన్సువాడ: మృతి చెందిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి
బాన్సువాడ అటవీ రేంజ్ పరిధిలో పని చేస్తున్న నిజాంసాగర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి (ఎఫ్ఎస్ఓ) గులాం దస్తగిరి(58) విధులు నిర్వహిస్తూ మృతి చెందారు. విధుల్లో ఉన్న ఆయన బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే దస్తగిరిని బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ దస్తగిరి మృతి చెందారు. ఫారెస్ట్ జిల్లా డివిజన్ అధికారులు దస్తగిరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
Similar News
News November 9, 2024
NZB: ‘జితేందర్ రెడ్డి’ సినిమా చూసిన ఎమ్మెల్యేలు
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారిలతో కలిసి ABVP నాయకుడు జితేందర్ రెడ్డి చిత్రాన్ని శనివారం నిజామాబాద్‌లోని ఓ థియేటర్‌లో జితేందర్ రెడ్డి సినిమాను చూశారు. వారితో పాటు ఆర్మూర్‌కి చెందిన BJP జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, BJP పట్టణ ఉపాధ్యక్షుడు ప్రకాశ్, కార్యదర్శి కిరణ్ ఉన్నారు.
News November 9, 2024
KMR: బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
బాలికను స్కూల్ టీచర్ లైంగికంగా వేధించిన ఘటన బిక్కనూర్‌లో వెలుగుచూసింది. ఓ పాఠశాల విద్యార్థిని మండలానికి చెందిన టీచర్ శ్రీనివాస్ లైంగికంగా వేధించాడు. కాచ్చాపూర్ ఓ మాజీ ప్రజాప్రతినిధి విషయం బయటికి రాకుండా సంధి చేశాడు. విషయం తెలుసుకున్న జిల్లా న్యాయసేవ సంస్థ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్లారెడ్డి DSP నిందితుడితో పాటు HM కాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీపై కేసు నమోదు చేశారు.
News November 9, 2024
నిజామాబాద్‌లో లారీ క్లీనర్ హత్య
వ్యక్తి హత్యకు గురైన ఘటన NZBలో జరిగింది. మద్నూర్‌కి చెందిన లక్ష్మణ్(30) లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. శుక్రవారం కాలూరు కూడలి వద్ద తీవ్ర గాయాలతో పడిఉన్న లక్ష్మణ్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతడిని ఎవరో తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాతకక్షలు నేపథ్యంలో హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.