News August 15, 2024

బాన్సువాడ: సబార్డినేట్‌తో బూట్లు మోయించిన అధికారి

image

78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ అధికారి తన సబార్డినేట్‌తో బూట్ల మోయించిన ఘటన గురువారం బాన్సువాడలో జరిగింది. తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆర్డీఓ రమేశ్ రాథోడ్ బూట్లు వేసుకొని జెండా గద్దె వద్దకు వెళ్లాడు. ఆ తరువాత పొరపాటు తెలుసుకొని బూట్లు విడిచి అటెండర్‌తో పంపించారు. జెండా సాక్షిగా‌పై అధికారి బూట్లను అటెండర్ మోయించడంతో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News September 21, 2024

నాగన్న బావి పునరుద్ధరణ పనులను ప్రారంభించిన కలెక్టర్

image

లింగంపేటలో పరంపర ఫౌండేషన్, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడంవల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు.

News September 20, 2024

రైల్వేమంత్రిని కలిసిన NZB ఎంపీ అర్వింద్

image

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను NZB ఎంపీ అర్వింద్ దిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేకి సంబంధించి, పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్వోబీల నిర్మాణం పనులను వేగవంతం చేసేలా అధికారులకు సూచనలను ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

News September 20, 2024

ఆలూరు : వీధికుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు

image

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో శుక్రవారం పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిచ్చికుక్కల దాడిలో ఏడుగురు గాయపడ్డారని చెప్పారు. గాయాలైన వారిని మొదటగా దేగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.