News August 13, 2024
బాన్సువాడ: సైబర్ మోసం.. రూ.1,32,000 పొగొట్టుకున్నాడు
ఉద్యోగం పేరిట ఓ యువకుడు సైబర్ వలలో చిక్కి రూ.1,30,200 పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో జరిగింది. తాడ్‌కోల్‌కు చెందిన విష్ణు అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డాటా ఎంట్రీ ఉద్యోగం వచ్చిందని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అనంతరం నష్టం జరిగిందని సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో రూ.1,30,200 పంపి మోసపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.
Similar News
News September 12, 2024
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు పిట్లం విద్యార్ధిని ఎంపిక
రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు పిట్లం ZPHS విద్యార్ధిని మహాలక్ష్మి ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు తెలిపారు. పాల్వంచలో ఈ నెల 9 న జరిగిన జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్లో మహాలక్ష్మి ప్రతిభ కనబరిచింది. ఖమ్మంలో జిల్లా కల్లూరు మిని స్టేడియంలో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే ఖో ఖో సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఆమె ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు అభినందించారు.
News September 12, 2024
పొతంగల్: సీఎస్సీ నిర్వాహకురాలి ఇంటికి తాళం, వేలం
పొతంగల్ మండలం కల్లూరు గ్రామంలో కాజేసిన రూ.45 లక్షలు సకాలంలో చెల్లించక పోవడంతో కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలి ఇంటికి మహిళా సంఘాల సభ్యులు బుధవారం తాళం వేశారు. అనంతరం ఆ ఇంటిని వేలం వేయగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.14.80 లక్షలకు దక్కించుకున్నాడు. సదరు మహిళ నెల రోజుల్లో కాజేసిన సొమ్ము చెల్లిస్తానని బాండ్ రాసిచ్చి రూ.6 లక్షల చెల్లించి కాలయాపన చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.
News September 11, 2024
KMR: తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు
కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 252 ఆత్మహత్యలు నమోదయ్యాయంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.