News January 5, 2025

బాన్స్‌వాడ: భూములు కబ్జా కాకుండా చూడాలని వినతి

image

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థకు సంబంధించిన భూములు కబ్జాకు గురికాకుండా చూడాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ను అదనపు కలెక్టర్‌కు వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆగ్రో ఛైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ కబ్జా చేసిన భూములను ఆగ్రోస్ సంస్థకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు కోరినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 16, 2025

బాన్సువాడ: అధికారులతో  సబ్ కలెక్టర్ సమీక్ష సమావేశం

image

బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి తహాసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News January 16, 2025

NZB: క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరపండి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.

News January 16, 2025

NZB: పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నాం: జీవన్ రెడ్డి 

image

కాంగ్రెస్ కొమ్ము గాస్తున్నా పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నామని ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. హోం మంత్రిత్వశాఖను కూడా నిర్వ హిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వరెస్ట్ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి అరెస్టుల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బందాలా..? అని ఆయన మండిపడ్డారు.